Pushpa 2: The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనలో ప్రతిభావంతులైన చిత్ర దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో న పుష్ప 2: ది రూల్ పాన్ ఇండియా చిత్రం గురించి మన అందరికి తెలుసు. ఈ చిత్రం అప్డేట్ కోసం ప్రేక్షకులు మరియు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నరు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న జంటగా నడిస్తున్నారు.
నిన్న చిత్ర మేకర్స్ ఒక ముఖ్యమైన ప్రకటనను అందించారు మరియు ఈరోజు పుష్ప 2పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు వెల్లడి చేయబడుతుందని వారు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఈ అప్డేట్ ఎలా ఉంటుందో దానికోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ మరియు ఇతర తారాగణం ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు, పుష్ప 2: ది రూల్ ఆగస్ట్ 15, 2024న థియేటర్లలోకి ప్రపంచ వ్యాప్తంగా రానుంది.













