Pushpa 2: The Rule: పుష్ప 2: ది రూల్ టీమ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రకటన ఇదిగో వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8 న పుష్ప 2: ది రూల్ టీజర్‌ను ఆవిష్కరించడానికి మేకర్స్ ప్రమోషన్లను పెద్ద తరహాలో గ్రాండ్ ప్రారంభించారు చిత్ర బృందం.
ఇదే విషయాన్ని తెలియజేసేందుకు కొద్దిసేపటి క్రితం ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో జాతర ఎపిసోడ్‌పై విపరీతమైన హైప్ ఉంది ఈ పోస్టర్ చూస్తుంటే మనకు తెలుస్తుంది, మరి టీజర్లో ఈ ప్రత్యేక సన్నివేశం నుండి ఏమైనా షాట్లు ఉంటాయో లేదో మరి వేచి చూడాలి.
ఈ కొత్త పోస్టర్లో మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, విడుదల తేదీ మారలేదు మరియు ముందుగా ప్రకటించినట్లుగా 15 ఆగస్ట్ 2024న సినిమా వస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్లో అల్లు అర్జున్ జంటగా రష్మిక కథానాయికగా నటిస్తుంది. ఈ యాక్షన్ డ్రామాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు అన్న విషయం మన అందరికి తెలుసు.















